
హ్యూందాయ్ ఆధ్వర్యంలో హెచ్‌టీడబ్ల్యూ వో ఇన్నోవేషన్ సెం
●ఆవిష్కరించిన మంత్రి టీఆర్‌బీ రాజా
కొరుక్కుపేట: చైన్నెలోని తైయూర్‌లోని ఐఐటీ మద్రాసు డిస్కవరీ శాటిలైట్ క్యాంపస్‌లో తమిళనాడు ప్రభుత్వం భాగస్వామ్యంతో హ్యూందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఏఐఎస్ ) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు (ఐఐటీ మద్రాసు ) సంయుక్తంగా కలిసి హ్యూందాయ్ హెచ్‌టిడబ్ల్యూవో ఇన్నోవేషన్ సెంటర్ డిజన్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ అండ్ వాణిజ్య శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా పాల్గొన్ని గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ , దాని పర్యావరణ వ్యవస్థ రంగంలో ఆవిష్కరణలకు ఉత్పేరకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రం అయిన హ్యూందాయ్ హెచ్‌టీడబ్ల్యూవో ఇన్నోవేషన్ సెంటర్ డిజన్‌ను ఆవిష్కరించారు. ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, హ్యూందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షూ కిమ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.