
కొత్త చిత్రానికి గౌతమ్ కార్తీక్ రెడీ
తమిళసినిమా: పేరు మార్చుకుంటున్న నటుల్లో గౌతమ్ కార్తీక్ కూడా చేరారు. ఈయన ఇప్పుడు తన పేరును గౌతమ్ రామ్ కార్తీక్ అని మార్చుకున్నారు. ఈయన కొత్త చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నారు. వెరూస్ ప్రొడక్షన్‌న్స్ పతాకంపై తనిస్తాన్ ఫెర్నాడ్, రాజరాజెన్ గణనసంబంధం, సంజయ్‌శంకర్ సైక్ ముజీబ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సూర్యప్రతాప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన నాళైయ ఇయక్కనార్ సీజన్ 1 శిక్షణ పొందడంతో పాటు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన కోచ్చడైయాన్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారన్నది గమనార్హం. సైన్స్, ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్ పోలీస్ అధికారిగా నటించనున్నట్లు నిర్మాతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దర్శకుడు సూర్యప్రతాప్ కథ చెప్పినప్పుడే ఆయన తన భావాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగల ప్రతిభను గుర్తించామని తెలిపారు. లేకపోతే హాస్యంతో పాటు బలమైన పాత్రలోనూ తనను తాను నిరూపించుకున్న నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ ఈ చిత్రం పోలీస్ అధికారిగా నటించనున్నారని ఇది ఆయన కెరియర్‌లోనే ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. ఈ చిత్రానికి అర్జున్ రాజా చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, ఆ సమయంలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.