పెట్‌ల్యాండ్ ప్రభుత్వాసుపత్రి ప్రారంభం
వేలూరు: వేలూరులో చారిత్రక నేపథ్యం కలిగిన (వంద సంవత్సరాలు) వేలూరు పెట్‌ల్యాండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రిని సీఎం స్టాలిన్ బుధవారం ప్రారంభించారు. పెడ్‌ల్యాండ్ ఆసుపత్రి వేలూరు పట్టణ నడి బొడ్డున పురాతన కట్టడాలతో ఉండడంతో డీఎంకే ప్రభుత్వంలో ఈ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిగా మార్చేందుకు రూ: 197.81 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు పూర్తి కావడంతో సీఎం స్టాలిన్ ఆసుపత్రిని ప్రారంభించి ఆసుపత్రిలో రోగులకు ఏర్పాటు చేసిన వసతులను తనిఖీ చేశారు. వేలూరు జిల్లాలో రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు జిల్లాలోని అనకట్టు నియోజక వర్గంలో నూతనంగా నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సాయంత్రం తిరుపత్తూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆయనతో పాటూ మంత్రులు దురై మురుగన్, ఎం. సుబ్రమణియన్, ఆర్. గాంధీ, ఏవా వేలు, కలెక్టర్ సుబ్బలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కదీర్‌ఆనంద్, ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, అములు, ఈశ్వరప్ప, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్‌లతో పాటు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాట్పాడి నుంచి వేలూరు వరకు ఘన స్వాగతం
ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన చైన్నె నుంచి రైలు మార్గంలో కాట్పాడి చేరుకున్నారు. కాట్పాడి రైల్యే స్టేషన్‌లో కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎస్‌ఫి మదివాణన్‌లతో పాటు పార్టీ కార్యకర్తలు , పాఠశాల విద్యార్థులు పుష్ప గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కారులో వేలూరుకు బయలుదేరిన ఆయనకు కాట్పాడి చిత్తూరు బస్టాండ్, సిల్క్‌మిల్ రోడ్డు, విరుదంబట్టు, కొత్త బస్టాండ్, గ్రీన్ సర్కిల్, సౌత్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీఎంకే పార్టీ కార్యాలయం వద్ద ఆయా డివిజన్‌లకు చెందిన ప్రతినిధులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అదే విధంగా రోడ్డు పొడవునా కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కొత్త బస్టాండ్ నుంచి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో రోడ్డు పక్కన నిలిచి ఉండటాన్ని చూసిన ఆయన కారును దిగి నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ నడిచారు. పట్టణంలో అక్కడక్కడే కారు దిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. కాగా సీఎం పర్యటనలో స్థానిక విలేకరులను అనుమతించకపోవడం గమనార్హం.
వేలూరులో సీఎం స్టాలిన్‌కు ఘన స్వాగతం
పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు
పెట్‌ల్యాండ్ ప్రభుత్వాసుపత్రి ప్రారంభం
పెట్‌ల్యాండ్ ప్రభుత్వాసుపత్రి ప్రారంభం


