
‘కూలీ’ తొలి సింగిల్ సాంగ్ ఎప్పుడంటే ?
తమిళసినిమా: రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న రెండు భారీ చిత్రాలలో కూలీ ఒకటి. లోకేష్ కనకరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ టాలీవుడ్ స్టార్ నాగార్జున, సత్యరాజ్ సౌబినచ షాహీర్, నటి శృతిహాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, ఫాహత్ ఫాజిల్, రెబామోనిక జాన్ తదితర ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే ప్రత్యేక పాటలో మెరవనున్నారు గోల్డ్ స్మగ్లింగ్ ఇతివృత్తంతో సాగే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కూలీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే చిత్రం టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య విశేషాదరణ పొందింది. కాగా చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర వర్గాలు ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా కూలీ చిత్రం ఫస్టు క్లిప్స్, చికిటు వైబ్ పొటు ప్రోమో వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు అనిరుద్, డానన్స్ మాస్టర్ శాండీ నటించిన ఈ ప్రోమో విడుదలై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను బుధవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. దీంతో రజనీకాంత్ అభిమానులు ఖుషి అవుతున్నారు.