మైక్రో ఇరిగేషన్‌ పరికరాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

మైక్రో ఇరిగేషన్‌ పరికరాలపై అవగాహన

May 22 2025 5:46 AM | Updated on May 22 2025 5:46 AM

మైక్రో ఇరిగేషన్‌ పరికరాలపై అవగాహన

మైక్రో ఇరిగేషన్‌ పరికరాలపై అవగాహన

తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు మైక్రో ఇరిగేషన్‌ పరికరాలపై అవగాహన కల్పించే కార్యక్రమం బుధవారం జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో జరిగిన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ గణేషన్‌ పాల్గొని, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గణేషన్‌ మాట్లాడుతూ రైతులు మైక్రో ఇరిగేషన్‌ విధానంపై అవగాహన కలిగి ఉంటే, నీటిని ఆదా చేసుకోవడంతోపాటు సాగుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మైక్రో ఇరిగేషన్‌కు ఉపయోగించే వస్తువులపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ విజయకుమార్‌, ఇంజినీర్‌ రమేష్‌, హార్టికల్చర్‌ అధికారి మహేంద్రన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement