
చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి
తిరువళ్లూరు: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన తిరువళ్లూరు సమీపంలోని పోలీవా క్కం గ్రామంలో విషాదం నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కం గ్రామానికి చెందిన అమల్‌రాజ్(42). ఇతడికి భార్య పిల్లలు ఉన్నారు. వికలాంగుడైన అమల్‌రాజ్ సోమవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని పొన్నిమ్మన్ ఆలయం వద్ద వున్న కొలనులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపల వేట సాగిస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో కొలనులో పడిపోయాడు. ఈ సమయంలో సాయం కోసం గట్టిగా అరవడంతో చుట్టుపక్కలనున్న వారు అమల్‌రాజ్‌ను రక్షించి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అతడ్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య ఇందిర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు.