
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
తిరువళ్లూరు: భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యువకుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తిరువళ్లూ జిల్లా మహిళ కోర్టు న్యాయమూర్తి రేవతి తీర్పు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హరీష్ (29) తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు టీచర్ కాలనీలో భార్య రజియాకాట్టు(36)తో కలిసి నివాసమున్నాడు. ఈ క్రమంలో భార్యపై హరీష్‌కు అను మానం ఉండేది. ఈ విషయమై ఇద్దరి మధ్య తర చూ మనస్పర్థలు రావడంతో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో 2022 మే1న హరీష్ భార్యను హత్య చేశాడు. ఈ సంఘటనపై మృతు రాలి బంధువు అంబత్తూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు మహిళ కోర్టులో సాగింది. నేరం రుజువు కావడంతో హరీష్‌కు యావజ్జీవశిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రేవతి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ముద్దాయిని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు.