
17 ఏళ్లుగా పోరాడుతున్నాం..!
యోగిడా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై యూనిట్ సభ్యులు
తమిళసినిమా: ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సెంథిల్ కుమార్ నిర్మాతగా మారి శ్రీ మౌనిక సినీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం యోగిడా. నటి సాయి ధన్సిక ఫవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రంలో షాయాజీ షిండే, మనోబాల, కబీర్ తుహాన్ సింగ్, ఎస్థర్, రాజ్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ కృష్ణ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి ఎస్‌కేఏ.భూపతి ఛాయా గ్రహణం, దీపక్ దేవ్ నేపథ్య సంగీతాన్ని, అస్వమిత్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యా బ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో నటుడు విశాల్, దర్శకుడు ఆర్ వీ.ఉదయ్ కుమార్, పేరరసు, రాధా రవి, మీరా కధిరవన్, మిత్రన్ ఆర్.జవహర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటి సాయి ధన్సిక మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి పోరాడుతూనే ఉన్నామన్నారు. శ్రమను మాత్రమే నమ్మి ఈ రంగంలో ఇంతకాలం పయనించడం వల్ల యోగిడా చిత్రం వరకు వచ్చానన్నారు. నటుడు విశాల్ తనకు 15 ఏళ్ల క్రితమే తెలుసని చెప్పారు. ఆయన తాను ఆగస్టు 29వ తేదీన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నటుడు విశాల్ మాట్లాడుతూ సినిమా బాగా వచ్చిందని ముఖ్యంగా ఫైట్ సన్నివేశాలు బ్రహ్మాండంగా కుదిరాయని చెప్పారని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సాయి ధన్సిక తాను ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. యోగిడా చిత్రంలో ఫైట్స్ సన్నివేశాల్లో నటి సాయి ధన్సిక అద్భుతంగా నటించారని విశాల్ ప్రశంసించారు.