
పళ్లిపట్టులో జాతర కోలాహలం
పళ్లిపట్టు: పళ్లిపట్టులో మంగళవారం జాతర కోలాహలం జరిగింది. జాతర సందర్భంగా గ్రామ దేవత కొళ్లాపురమ్మ ఆలయంలో అమ్మవారికి ఉదయం అభిషేక పూజలు చేసి, పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు అమ్మవారికి అంబలి సమర్పించారు. ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి ,అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం కొళ్లపురమ్మకు మహి షాసుర మర్ధిని అలంకరణలో పుష్పాలంకరణ వాహన సేవలో కొలువు తీర్చి మేళతాళాలు నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. రాత్రి బంకమట్టితో గంగమ్మ తల్లిని అలంకరించి పూజలు చేసుకున్నారు.

పళ్లిపట్టులో జాతర కోలాహలం