
మద్యం దుకాణం ప్రారంభించొద్దు
నిరసన తెలుపుతున్న పట్టాభిరామాపురం మహిళలు
తిరుత్తణి: పట్టన శివారులో మద్యం దుకాణం ప్రారంభించవద్దని మహిళలు ఆందోళన చేపట్టారు. తిరుత్తణి సమీపం చైన్నె తిరుపతి జాతీయ రహ దారి సమీపంలో పట్టాభిరామాపురం పంచాయతీ పరిధిలో కొత్తగా టాస్మాక్ మద్యం షాపు ప్రారంభానికి టాస్మాక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త మద్యం షాపు ప్రా రంభాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆర్డీఓ, డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో మంగళవా రం పట్టాభిరామాపురం గ్రామానికి చెందిన మహిళలు వంద మందికి పైగా మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. దీంతో పట్టణ సీఐ మదియరసన్ మహిళలతో చర్చలు జరిపారు. గ్రామీణుల వ్య తిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టాస్మాక్ దుకాణం మరో ప్రాంతానికి తరలించేందుకు చర్చలు తీసుకుంటామని, గ్రామస్తులు ఆందోళన విరమించాలని కోరారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.