
పది కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టు
తిరువళ్లూరు: బస్సులో గంజాయిని తరలించి విక్రయించడానికి యత్నించిన ఇద్దరిని సెంగుడ్రం పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా సెంగుండ్రం, ఎన్నూరు, అత్తిపట్టు, మీంజూరు తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్టు ఆవడి పోలీసు కమిషనర్ శంకర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో సంబంధిత ప్రాంతాల్లో ఇన్‌స్పెక్టర్ శశికుమార్ నేతృత్వంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో సెంగుండ్రం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించారు. విచారణలో పట్టుబడిన వ్యక్తులు కారైకాల్ జిల్లాకు చెందిన మాదేష్(19), రాహుల్‌శుక్లా(20)గా గుర్తించారు. వీరు ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సులో గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. వారి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.