
ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు
తిరువళ్లూరు: ప్రైవేటు కంపెనీల నుంచి వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేసిన ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతె అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కన్నూరు కళంబేడు ప్రాంతంలో ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సమీపంలోని ప్రైవేటు కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను భారీగా డంప్ చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడాయి. అలాగే ఆ ప్రాంతంలో పొగ కమ్ముకోవడంతో సమీప గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు.