
థగ్ లైఫ్ ట్రైలర్ విడుదల
తమిళసినిమా: కమలహాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్‌లైఫ్. నటుడు శింబు, త్రిష జంటగా నటించిన ఇందులో అశోక్ సెల్వన్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిరత్నం కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కమలహాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మణిరత్నంకు చెందిన మెడ్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న థగ్ లైఫ్ చిత్రం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దీని టీజర్ చిత్రంపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఇటీవలే ఇందులోని జింగుచ్చా అనే పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్‌న్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం సాయంత్రం ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు, యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా భారీ బడ్జెట్ కమలహాసన్ స్మగ్లర్ల్‌గా నటించిన థగ్ లైఫ్, నాయగన్ చిత్రం తర్వాత కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో రూపొందడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.