
శుక్రవారం వస్తే సందడే!
మామన్ చిత్రంలో సూరి, ఐశ్వర్యలక్ష్మి
తమిళసినిమా: శుక్రవారం వస్తుందంటే నటీనటులు, దర్శక నిర్మాతల్లో గుబులు, డిస్ట్రిబ్యూటర్లలో హడావుడి, థియేటర్ల వద్ద సందడి మొదలవుతుండడం మామూలే. అలా ఈ శుక్రవారం తమిళంలో మూడు చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో సూరి కథానాయకుడిగా నటించిన మామన్, సంతానం హీరోగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్, నవీన్‌చంద్ర హీరోగా నటించిన లెవెన్ చిత్రాలు ఉన్నాయి. సూరి, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించిన మామన్ చిత్రంలో రాజ్‌కిరణ్, స్వాశిక ముఖ్య పాత్రలు పోషించారు. విళంగు వెబ్‌సీరీస్ ఫేమ్ పాండిరాజ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కే.కుమార్ నిర్మించారు. సంతానం కథానాయకుడిగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ ప్రేమ్ ఆనంద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రంహర్రర్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అలాగే నవీన్ చంద్ర హీరోగా తెలుగు,తమిళం భాషల్లో రూపొందిన చిత్రానికి లోకేశ్ అజిల్స్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. డీ.ఇమాన్ సంగీతం అందించారు. వీటిలో ప్రేక్షకులు దేనిని ఆదరిస్తారో వేచి చూడాలి.