
శేషవాహనంపై వేణుగోపాలుడి చిద్విలాసం
పళ్లిపట్టు: చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా గు రువారం రాత్రి వేణుగోపాలస్వామి శేషవాహనంపై గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు కటాక్షించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుసంధానంగా ఆర్కేపేట సమీపం ఎస్‌వీజీ.సపురంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో 11న చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు శేషవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించి బంగారు ఆభరణాలతో శేష వాహనంలో కొలువుదీర్చి గ్రామవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారికి కర్పూర హారతులిచ్చి, కొబ్బరి కాయలు కొట్టి దర్శించుకున్నారు. శేషవాహన సేవ ఉభయ దారులుగా గ్రామానికి చెందిన గిరి, తిరుమలేష్, ప్రకాష్ ఉత్సవ ఏర్పాట్లు చేశారు.