
పూండి రిజర్వాయర్‌లో మాక్‌డ్రిల్
తిరువళ్లూరు: జాతీయ విపత్తు ఏర్పడిన సమయంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడంపై రెవెన్యూ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పూండి రిజర్వాయర్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదలు, భూకంపాలు, యుద్ధం తదితర సమయంలో ఏర్పడే విపత్తులో చిక్కుకునే వారికి సాయం అందించడంతో పాటు, విపత్తు సమయంలో ప్రజలు ఎలా స్పందించాలన్న అంశంపై తిరువళ్లూరు జిల్లాలోని పూండి, గురువాయల్, రామతండం, సేతపాక్కం, వెళ్లివాయల్ తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఉషారాణి, తహసీల్దార్ రజినీకాంత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండర్ ప్రదీష్ , బీడీఓ వరదరాజన్, బ్లాక్ మెడికల్ ఆఫీసర్ రవిచంద్రన్, రెవెన్యూ అధికారులు శేఖర్, సుఖన్యదేవి పాల్గొన్నారు.