
70 వేల ఆటోలకు క్యూర్ కోడ్‌లు
సాక్షి, చైన్నె : చైన్నెలో 70 వేల ఆటోలకు క్యూర్ కోడ్ స్టిక్కర్లను అంటించారు. మరో 20 వేల ఆటోలకు అంటించే పనులు జరుగుతున్నాయి. చైన్నె నగరంలో సుమారు 90 వేల మేరకు ఆటోలు ఉన్న విషయం తెలిసిందే. ప్రయాణీకులకు భద్రత కల్పించే విధంగా, ప్రధానంగా మహిళలు, యువతులు, పిల్లలకు భద్రతా పరంగా మరింత తోడ్పాటు అందించేందుకు గ్రేటర్ చైన్నె పోలీసు కమిషనరేట్ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఆటోలకు క్యూర్ కోడ్ స్టిక్కర్లను అంటించే పనులు చేపట్టారు. చైన్నె నగరంలో 89,011 ఆటోలు ఉన్నట్టుగా పోలీసు పరిశీలనలో తేల్చారు. మిగిలిన ఆటోల వివరాలను సైతం సేకరిస్తున్నారు. అన్ని ఆటోల నెంబర్లు, ప్రయాణికులు అత్యవసర సమయాలలోక్యూర్ కోడ్‌ను ఉపయోగించేందుకు వీలుగా ప్రత్యేక వివరాలు, కంట్రోల్ రూమ్, గస్తీ పోలీసులకు తక్షన సమాచారాల చేర వేయడం వంటి ప్రక్రియతో క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లను సిద్ధం చేశారు. గత నెలన్నర రోజులుగా 70 వేల ఆటోలకు క్యూర్ కోడ్‌తో కూడిన స్టిక్కర్లను అంటించారు.మరో 20 వేల ఆటోలకు స్టిక్కర్టు అంటించే పనులను వేగవంతంచేశామని గ్రేటర్ చైన్నె పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.