
నాలుగు రోజులు వానలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. పలు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కుండ పోతగావర్షం పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ముందుగానే ప్రారంభం కానుంది. మరో పది రోజులలో ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీంతో తమిళనాడులోని పశ్చిమ కనుమల వెంబడి ఉన్న కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తేని, దిండుగల్, కోయంత్తూరు, ఈరోడ్ జిల్లాలోని రైతులు దుక్కి దున్నేపనిలో నిమగ్నమయ్యారు. ఈఏడాది పలు జిల్లాలో భానుడి ప్రభావం అధికంగానే ఉంటూవస్తున్నా, ముందుగానే రుతు పవనాలు రానున్నడం కొంత ఆనందాన్ని కలిగిస్తున్నది. ఏటా నైరుతి ప్రభావం అన్నదికేవళం పశ్చిమ కనుమల వెండి ఉన్న జిల్లాల మీదే ఉంటుంది. మిగిలిన చోట్ల చెదరు ముదురుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి నుంచి వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. తిరుచ్చి, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్, పుదుకోట్టై తదితర డెల్టా జిల్లాలో మోస్తారుగానే వర్షం పడింది. కోయంబత్తూరులోనూ వర్షం పడింది. డెల్టా జిల్లాలో కొన్ని చోట్ల ఈదురు గాలులు, ఉరుముల మెరుపుతో కూడిన వర్ష ప్రభావానికి అరటి పంట దెబ్బతింది. మామిడి సైతం నేల రాలింది. అండమాన్ తీరాన్ని రుతుపవనాలు తాకిన నేపథ్యంలో ఈ వర్షాలుమరి కొన్ని రోజులు ఎదురు చూడవచ్చు అని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర,శని, ఆది,సోమవారాలలో నీలగిరి, కోయంబత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, తదితర జిల్లాలో వర్షాలు పడుతాయని, డెల్టా, పశ్చిమ కనుమలవెంబడి జిల్లాలోనూ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం గురువారం ప్రకటించింది. పుదుకోట్టై జిల్లాతిరువారంకులం గ్రామంలో వర్షం, ఈదురుగాలులో కారణంగా దెబ్బ తిన్న అరటి పంటను మంత్రి శివ వీ మెయ్యనాథన్, ,వ్యవసాయ అధికారులు పరిశీలించారు.