
4 వేల కోచ్‌ల లక్ష్యం
● ఐసీఎఫ్ టార్గెట్
సాక్షి, చైన్నె : చైన్నె ఐసీఎఫ్ మరో ముందడుగు వేయనుంది. 2025–26లో నాలుగు వేల కోచ్‌లను తయారు చేయడం లక్ష్యంగా టార్గెట్‌ను నిర్ణయించుకున్నారు. భారత రైల్వేలోనే సరికొత్తగా, అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైళ్ల తయారీలో ఐసీఎఫ్ దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఐసీఎఫ్ చరిత్రలో ఎన్నో మైలు రాళ్లు చైన్నె నుంచి పట్టాలెక్కాయి. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలలో చైన్నె దేశానికే ఆదర్శంగా నిలుస్తూ, అగ్రస్థానాన్ని దక్కించుకుంటూ వస్తోంది. ఒక్కటా రెండా...ఎన్నో అత్యాధునిక రైళ్లు, బోగీల నిర్మాణంలో ఐసీఎఫ్ ఘన కీర్తిని చాటుకుంది. స్వదేశీ పరిజ్ఞానంగా ఆధునిక సౌకర్యాలతో సాగుతున్న ఐసీఎఫ్ నిర్మాణాలన్నీ సంతృప్తికరంగా మారింది. వందే భారత్ స్లీపర్ వర్షన్ వరకు అన్నీ ప్రత్యేకతను సంతరించుకున్నవే. ఈ పరిస్థితులలో 2024–25 సంవత్సరంలో గత రికార్డులను అధిగమించే విధంగా ఇక్కడ రైలు కోచ్‌ల తయారీ జరిగింది. గతంలో 2829 కోచ్‌లను ఒకే ఏడాదిలో తయారు చేయగా, 2024–25లో 3007 కోచ్‌లను సిద్ధం చేశారు. ఇందులో 1,169 డీపీఆర్ ఎస్ కోచ్‌లు ఉన్నాయి. వీటిలో వందే భారత్ స్లీపర్, వందేభారత్ చైర్ కార్, ఈఎంయూ, ఎంఈఎంయూలు ఉన్నాయి. 1,838 కోచ్‌లు ఎల్‌హెచ్‌బీలు ఉన్నాయి. వందేభారత్, ట్రెజరీ వ్యాన్ కోచ్‌ల పరిచయం, అమృత్ భారత్ 2.ఓ వంటి రైళ్లకు కోచ్‌ల తయారీలో ఐసీఎఫ్ దూసుకెళ్లింది. ఈ పరిస్థితులలో 2025–26లో 4 వేల కోచ్‌ల తయారీ లక్ష్యంగా టార్గెట్‌ను నిర్ణయించుకున్నారు. ఇందులో వందే భారత్ స్లీపర్ కోచ్‌లకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. మరిన్ని లగ్జరీ సేవలతో సూపర్ ఫాస్ట్ రైలు కోచ్‌లు రూపుదిద్దుకోనున్నాయి.
ఐసీఎఫ్