
రేపు తెరపైకి ఫైనల్ డెస్టినేషన్
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రాల్లో ఎవర్ గ్రీన్ చిత్రాలు చాలా ఉంటాయి. వాటిలో ఒకటి ఫైనల్ డెస్టినేషన్. ఈ చిత్రం సీక్వెల్ గత 25 ఏళ్లుగా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అలా తాజాగా రూపొందించిన సీక్వెల్ చిత్రం ఫైనల్ డెస్టినేషన్–బ్లడ్ లైన్స్. ఆడమ్ స్టెయిన్, జాచ్ లిపోన్స్కీ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని న్యూలైన్ సినిమా ఏ ప్రాక్టికల్ పిక్చర్స్, ఫ్రెష్ మ్యాన్ ఇయర్, ఫైర్ సైజ్ ఫిల్మ్‌స్ ప్రొడక్షనన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫైనల్ డెస్టినేషన్–బ్లడ్ లైన్స్ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్ర భారతదేశం డిస్ట్రిబ్యూషన్ హక్కులను వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ పొంది ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఇందులో ప్రధాన పాత్రను పోషించిన బ్రెక్ బాసింగర్ అభిప్రాయాన్ని చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేశారు. అందులో ఆమె తాను ఫైనల్ డెస్టినేషన్ చిత్ర ప్రపంచం లేని విషయాన్ని ఊహించలేనని పేర్కొన్నారు. ఫైనల్ డెస్టినేషన్ చిత్ర మొదటి రెండు భాగాల్లో తాను నటించానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ –బ్లడ్ లైన్స్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో బ్రెక్ బాసింగర్‌తోపాటు క్లెటిన్ శాంటా, జువానత, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మోన్, ఓవెల్ ఫాట్రిక్ జుయ్నర్, అన్నా లూర్ రియాకీహ్ల్ స్టెడ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
ఫైనల్ డెస్టినేషన్–బ్లడ్ లైన్స్ చిత్రంలో బ్లెక్ బాసింగర్ తదితరులు