బైకు ఢీకొని మేస్త్రీ మృతి
పళ్లిపట్టు: బైకు ఢీకొన్న ఘటనలో తాపీమేస్త్రికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో మృతి చెందారు. ఆగ్రహించి గ్రామీణులు శనివారం రాత్రి రాస్తారోకో చేశారు. పొదటూరుపేటకు సమీపంలోని ఈచ్చందోప్పు గ్రామానికి చెందిన కుమార్(45) తాపీమేస్త్రి. శనివారం సాయంత్రం ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు నడిచి వెళ్లాడు. ఆ సమయంలో అటువైపు వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అతన్ని పొదటూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక తాపిమేస్త్రి మృతిచెందాడు. ఆగ్రహించిన మృతుని కుటుంబీకులు, బంధువులు, గ్రామీణులు ప్రభుత్వాస్పత్రికి సమీపంలోని ప్రదాన రోడ్డులో రాస్తారోకో చేశారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రాస్తారోకో తో ఆస్పత్రి ప్రాంతంలో ఉ ద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని చర్చలు జరిపి రాస్తారోకో విరమింపజేశారు.
బైకు ఢీకొని మేస్త్రీ మృతి


