సాక్షి, చైన్నె :సంచలనాత్మక వైద్య సేవల్లో ఎంజీఎం హెల్త్ కేర్ అరుదైన పేగు రుగ్మత చికిత్స కోసం తొలి మోడిఫైడ్ మల్టీ–విసెరల్ ట్రాన్‌న్స్‌ప్లాంట్ ( ఎంఎంవీటీ)ని విజయవంతంగా నిర్వహించింది. కేరళకు చెందిన 32 ఏళ్ల రోగి ప్రాణాలను ఈ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా రక్షించారు. రక్త విరేచనాలతో పాటు హిమొగ్లోబిన్ స్థాయిలలో తీవ్రమైన తగ్గుదల, పోషహార లోపం, ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు వాపుతో బాధపడుతున్న ఈ రోగికి జరిగిన ట్రాన్స్‌ప్లాంట్ గురించి ఎంఎంవీటీ ఆర్గాన్ ట్రాన్‌న్స్‌ప్లాంట్ చైర్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ వైద్య, మల్టీ విసెరల్ అండ్ అబ్డామినల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సెంథిల్ ముత్తురామన్, సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శివకుమార్ మహాలింగం, మల్టీ విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్ డాక్టర్ వెంకటేష్, డాక్టర్ దినేష్ బాబు, డాక్టర్ నివాష్ చంద్రశేఖరన్‌తో కూడిన బృందం శుక్రవారం స్థానికంగా ప్రకటించింది. మోడిఫైడ్ మల్టీ–విసెరల్ ట్రాన్‌న్స్‌ప్లాంట్‌తో ముందుకు సాగడానికి ముందు రోగిని స్థిరీకరించడానికి కీలకమైన చర్యలు తీసుకున్నామని వివరించారు.


