
పంచాయతీ మణి సహాయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి
● ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ ప్రారంభం ● ప్రారంభించిన మంత్రి పెరియస్వామి
కొరుక్కుపేట: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా పంచాయతీ మణి పేరిట సహాయ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బుధవారం టోల్ ఫ్రీ నంబరుతో కూడిన ఈ సేవా కేంద్రాన్ని చైన్నె సైదాపేట పనగల్ మాళిగైలో మంత్రి పెరియ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ మణి అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దీని ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి పంచాయతీలను సంప్రదించడానికి వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా 155340 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీలైనంత వేగంగా పరిష్కారం అయ్యేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.