
శిబిరాన్ని ప్రారంభిస్తున్న సుధాకర్, అరుణ్
వేలూరు: వేలూరు ముత్తుమండపం ప్రాంతానికి చెందిన రంగనాథన్ పండ్లు వ్యాపారి. ఇతను రోజూ అప్పుకల్లు గ్రామంలోని రైతుల వద్ద బొప్పాయి పళ్లను కొనుగోలు చేసి మార్కెట్‌కు తరలిస్తారు. శుక్రవారం సాయంత్రం కొనుగోలు చేసిన పళ్లలో ఓ బొప్పాయి పెరుమాళ్ ఆకారణంలో ఉండడంతో స్థానికులు పూజలు నిర్వహించారు.
విద్యార్థుల్లో అవగాహనకే ‘కల్పవృక్ష’
సాక్షి, చైన్నె: విద్యార్థుల మేధాసంపతి పెంపునకే కల్పవృక్ష –2023 సదస్సు నిర్వహిస్తున్నట్లు వక్తలు వ్యాఖ్యానించారు. డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి నేతృత్వంలో కల్పవృక్ష పేరిట 16వ వార్షిక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) రెండు రోజుల సదస్సు శనివారం చైన్నెలో ప్రారంభమైంది. అగర్వాల్స్ చైర్మన్ , ప్రొఫెసర్ అమర్ అగర్వాల్ అధ్యక్షతన జరిగి ఈ సదస్సుకు ఏఐఓఎస్ సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ నమ్రత శర్మ, డాక్టర్ సంతోష్ హునావాలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కంటి సంబంధిత వ్యాధులు, చికిత్సలు, అత్యాధునిక విధానాల గురించి డాక్టర్ నమ్రత శర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉత్తమ సేవలను అందించిన డాక్టర్ చాందినిని అవార్డులతో సత్కరించారు. డాక్టర్లు అతియా అగర్వాల్, సౌందరి, ప్రియ,రమ్య, కీర్తి పాల్గొన్నారు.
చైన్నె పోలీసులకు
ప్రత్యేక వైద్యశిబిరం
సాక్షి, చైన్నె : చైన్నెలోని పోలీసు సిబ్బందికి ఈనెల 29వ తేదీ వరకు ఉచితంగా గుండె సంబంధిత చికిత్సలపై ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రోమ్డ్ ఆసుపత్రి ఏర్పాటు చేసింది. కొట్టివాక్కంలోని ప్రోమ్డ్ ఆవరణలో శనివారం వరల్డ్ హార్ట్ డే వేడుకలు జరిగాయి. చిరంజీవి, మేరీ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు నేతృత్వంలో గుండె సంబంధిత వ్యాధులు, చికిత్సలు, ఆరోగ్య జాగ్రత్తలను వివరిస్తూ వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు ప్లకార్డులతో మానవహారం నిర్వహించారు. చైన్నెట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ ఆర్. సుధాకర్, ఆస్పత్రి చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ అరుణ్ కల్యాణ సుందరం పోలీసులకు ఉచిత గుండె వైద్య చికిత్సా శిబిరాన్ని ప్రారంభించారు. ఈనెల 29వ తేదీ వరకు ఈ శిబిరం జరుగుతుందని, పోలీసులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
శివగంగైలో రైల్ రోకో
● వివిధ పార్టీలకు చెందిన
వెయ్యి మందికి పైగా అరెస్టు
కొరుక్కుపేట: శివగంగైలో పలు రైళ్లు ఆపడం లేదని ఆరోపిస్తూ వివిధ పార్టీల నాయకులు, స్థానికులు శనివారం రైల్‌రోకో చేపట్టారు. కరైకుడి–చైన్నె పల్లవన్ ఎక్స్‌ప్రెస్ రైలును మనమదురై వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. తాంబరం–సెంగోట్టై రైలును శివగంగైలో ఆపాలని కోరారు. ఇక రైల్‌రోకో సందర్భంగా శివగంగై ప్రాంతంలో 90 శాతం దుకాణాలు మూతపడ్డాయి. ప్రధాన రహదారులు, వీధులు, బస్టాండ్ నిర్మానుష్యంగా మారాయి. సిటీ కౌన్సిల్ అధ్యక్షుడు దురై ఆనంద్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు చెందిన వెయ్యి మందికి పైగా ప్రజలు రైల్వే స్టేషన్‌న వైపు ర్యాలీగా బయలుదేరారు. పోలీసుల భద్రతను దాటుకుని రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి పట్టాలపై కూర్చున్నారు. దీంతో చైన్నె నుంచి రామేశ్వరం వస్తున్న రైలు శివగంగై రైల్వేస్టేషన్‌లో గంటకు పైగా ఆగిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి దాదాపు 1000 మందికిపైగా అరెస్టు చేశారు. అనంతరం రైళ్లను పునరుద్ధరించారు.

పట్టాలపై నినాదాలు చేస్తున్న నిరసనకారులు