
మీడియాతో మాట్లాడుతున్న వైద్యుల బృందం
● గుజరాతీ మహిళకు అరుదైన చికిత్స
సాక్షి, చైన్నె: గుమ్మిడిపూండి సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురైన యువతి ఊపిరితిత్తులతో ఓ గుజరాతీ మహిళకు రెలా వైద్యులు ఊపిరి పోశారు. అవయవ మార్పి డి శస్త్రచికిత్స విజయవంతంతో రెండు వారాల్లో ఆ మహిళ ఆరోగ్యవంతురాలయ్యారు. క్రోంపేటలోని రెలా ఆస్పత్రి ఆవరణలో గురువారం ఈ అవయవ మార్పిడి శస్త్ర చికిత్స గురించి ఆస్పత్రి చైర్మన్ ప్రొఫెసర్ మహ్మద్ రెలా, క్లీనికల్ హెడ్ డాక్టర్ ఆర్ మోహన్ బృందం మీడియాకు వివరించారు. గుజరాత్ రాష్ట్రం వడోదరకు చెందిన దింపాల్ షా(42) కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్య తో బాధ పడుతూ వచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఎదురైన తీవ్ర సమస్యలతో క్రోం పేట రెలాలో చేరారు. ఆమెకు ఐఎల్‌డీ వ్యాధి ఆమెకు సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఫైబ్రోటిక్ ఊపిరితిత్తుల వ్యాధి కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది, కొన్ని సార్లు దీనిని హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ లేదా బర్డ్ బ్రీడర్స్ ఊపిరితిత్తుల వ్యాధి అని పిలుస్తారు, ఇది పావురం రెట్టల వల్ల వస్తుందన్నారు.
అవయవ దానంతో..
డింపాల్ షా పరిస్థితి క్షీణించడంతో ఆమెకు రెండు ఊపిరితిత్తుల మార్పిడి అవశ్యమైంది. దాతకోసం ఎదురు చూశారు. ఈ సమయంలో రోడ్డుప్రమాదం రూపంలో యువతికి బ్రెయిన్ డెడ్ కావడం, ఆమె కుటుంబం అవయవదానానికి ముందుకు రావడంతో డింపాల్ షాకు శస్త్రచికిత్స నిర్వహణకు రెలా వైద్యులు సిద్ధమయ్యారు. ఆ యువతి ఊపిరితిత్తులు, ఈ మహిళకు అన్ని రకాలుగా సరిపోవడం కలిసి వచ్చిన అంశంగా మారింది. ఈనెల ఐదవ తేదీ రాత్రి కొన్ని గంటల పాటు శ్రస్త చికిత్స నిర్వహించారు. రెండు వారాల్లో ఆ మహిళ ఆరోగ్య వంతురాలయ్యారు.