తమన్నా
తమిళసినిమా: బ్యూటీకి బ్రాండ్ అంబాసిడర్ నటి తమన్నా. ఈ గుజరాతీ భామ అతిపిన్న వయసులోనే అంటే 13 ఏళ్ల ప్రాయంలోనే నటిగా సినీ రంగప్రవేశం చేశారు. ముందుగా హిందీ చిత్రాలలో నటించి ఆ తరువాత దక్షిణాదికి ఎంట్రీ ఇచ్చారు. ఆదిలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసి సిల్వర్ స్క్రీన్ గ్లామర్‌స్టార్‌గా వెలిగారు. బాహుబలి, సైరా చిత్రాలలో తనలోని నటనా ప్రతిభను వెలికితీసి అందం, అభినయం తనకే సొంతం అని నిరూపించుకున్నారు. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి జంటగా బోళాశంకర్ చిత్రంతో పాటు రజనీకాంత్‌కు జంటగా జైలర్ చిత్రాన్ని పూర్తిచేసి సుందర్ సి సరసన అరణ్మణై–4 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే పెద్దప్రేమ, పెళ్లి వదంతుల్లో చిక్కుకుని ఈ బ్యూటీ సమీపకాలంలో బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు అంటూ వార్తల్లో నానుతున్నారు. అయితే ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్‌గానే జీవిస్తున్న తమన్నా తన 18 ఏళ్ల సినీ పయనం సంతోషంగా ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకు జాతకాలపై నమ్మకం ఎక్కువ అన్నారు. అందుకే తన పేరులో ఏ, హెచ్ అనే రెండు అక్షరాలను అదనంగా చేర్చనున్నట్లు మిల్కీబ్యూటీ చెప్పారు. ఆ తరువాత పలు విధాలుగా మంచి జరిగిందన్నారు. కెరీర్ పరంగానూ బాగుందని చెప్పారు. ఇకపోతే తన పెళ్లి గురించి సమీప కాలంలో రకరకాల ప్రచారం జరుగుతోందన్నారు. అయినా తన అభిమానులకు ముందుగా చెప్పకుండా తాను ఎలా పెళ్లిచేసుకుంటాను ని తమన్నా ప్రశ్నించారు.
మామన్నన్ ఆడియో వేడుకలో చిత్ర యూనిట్