కరుమారియమ్మన్‌ ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

కరుమారియమ్మన్‌ ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం

Jun 2 2023 1:00 AM | Updated on Jun 2 2023 1:00 AM

తిరువొత్తియూరు: ఎన్నూరు నేతాజీ నగర్‌ దేవి కరుమారియమ్మన్‌ ఆలయంలో కుంభాభిషేకం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నూరు, నేతాజీనగర్‌, దేవి కరుమారియమ్మన్‌ ఆలయ అష్టబంధన కుంభాభిషేక కార్యక్రమం గ్రామ పెద్దలు, కార్మికుల సంక్షేమ కమిటీ అధినేత, ఎర్నావూరు ఎ.నారాయణన్‌ నేతృత్వంలో నిర్వహించారు. ఆలయ ద్వారం వద్ద ఐదు హోమగుండాలు ఏర్పాటు చేసి యాగాలు, పూజలు చేశారు. రాజగోపురం మూలస్థానం, దురైగయమ్మన్‌ ఆలయ కలశాలకు కుంభాభిషేకం నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై చల్లారు. నిరంతరం అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కుంభాభిషేకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షులు డీఎంకే తనియరసు, డీఎంకే కార్యదర్శి వీఎం అరులాసన్‌, సమత్తువ పార్టీ సెక్రటరీ కార్తీక్‌ నారాయణన్‌, కోశాధికారి కన్నన్‌, కార్యక్రమం టీమ్‌ సభ్యులు గణేశన్‌ దేవేంద్రన్‌, నాగరాజ్‌, ప్రజా రాజకీయ నాయకులు యాసమి, శివశంకరన్‌, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement