
మృతి చెందిన బాబు (ఫైల్)
●కోడలి ఆత్మహత్య
అన్నానగర్: కడలూరు సమీపంలో తాగునీరు పట్టే విషయంలో అత్తగారితో గొడవపడిన కోడలు గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడలూరు జిల్లా చేపాక్కం గ్రామానికి చెందిన గోవిందరాజ్ భార్య అనూష (19)కి, ఆమె అత్త రాజకుమారికి గురువారం ఉదయం ఇంటిలోని కొళాయిలో ఎవరు ముందుగా నీరు పట్టాలి అన్న విషయంపై గొడవ జరిగింది. తర్వాత రాజకుమారి పనికి వెళ్లింది. గోవిందరాజు పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తలుపు లోపలి నుంచి గడియవేసి ఉంది. తలుపు తట్టినా తెరచుకోలేదు. అనుమానం వచ్చిన అతడు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అతని భార్య అనూష దుపట్టాతో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం వేపూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్ ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
విద్యుత్ స్తంభం నుంచి పడి
లైన్‌మన్ మృతి
తిరుత్తణి: విద్యుత్ స్తంభం నుంచి పడి లైన్‌మన్ మృతిచెందిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపం మద్దూరు కాలనీకి చెందిన బాబు(48) విద్యుత్ లైన్‌మన్. ఇతను తాడూరు సమీపం ఎల్‌ఎన్ కండ్రిగ వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరాలో ఏర్పడిన మరమ్మతులను సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం నుంచి కిందపడి మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.