తిరువొత్తియూరు: అడయారు తిరువిక వంతెన వద్ద నదిలో దూకి బుధవారం రాత్రి ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె మందవెల్లి మొదటి వీధికి చెందిన రామచంద్రన్ (36) వేళచ్చేరిలో వున్న ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. అతను బుధవారం రాత్రి అడయారు తిరువికా వంతెన వద్ద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న అడయారు పోలీసులు తిరువాన్మియూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గాలించారు. గురువారం ఉదయం 6.45 గంటలకు నదిలో రామచంద్రన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో తీవ్ర ఒత్తిడికి గురై నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.