తిరువొత్తియూరు: చైన్నె మనలిలో మత్తుమాత్రలు విక్రయిస్తున్న నేపాల్‌కు చెందిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె మనలిలో మత్తు కోసం ఉపయోగించు పెయిన్ కిల్లర్ మాత్రలను ఆన్‌లైన్ ద్వారా తీసుకుని యువకులకు విక్రయిస్తున్నట్లు మనలి పోలీసులకు సమాచారం అందింది. మనలి పోలీసు సహాయ కమిషనర్ దక్షిణామూర్తి ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ సుందర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు పురుషోత్తమన్, చిత్ర, పోలీసులు మనలి బస్టేషన్ వద్ద నిఘా పెట్టారు. ఆ సమయంలో మోటారు సైకిల్‌లో అనుమానాస్పదంగా వచ్చిన యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. పెట్రోల్ ట్యాంకులో తనిఖీ చేయగా ఎక్కువగా ఉపయోగించే పెయిన్ కిల్లర్ మాత్రలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ మాత్రలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి మనలి ప్రాంతంలో ఉన్న హోటల్లో పని చేస్తున్న వారికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బీరజ్ లింబో (30), కుసైల్‌తాయా 920), చైన్నె నందనంలో ఉంటున్న రాయ్ 930), చేపాక్కం భరత్ 920), వ్యాసర్‌పాడికి చెందిన ఇంటి యజమాని కప్పురాయన్ (50)ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2,500 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.