
వేలం పాట నిర్వహిస్తున్న అధికారులు
పళ్లిపట్టు: అమ్మయార్ కుప్పం పంచాయతీలో మంగళవారం నిర్వహించిన వేలం పాటలో రూ. 3.53 లక్షల ఆదాయం వచ్చింది. ఆర్కేపేట యూనియన్ అమ్మయార్‌కుప్పం మేజర్ గ్రామ పంచాయతీలోని వారపుసంత, డైలీ మార్కెట్ హక్కులకు వేలం నిర్వహించారు. సర్పంచ్ ఆనంది, డిప్యూటీ బీడీఓ అగస్టియన్‌రాజ్ సమక్షంలో జరిగింది. ఇందులో ఆరుగురు రూ. 5 వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు. ప్రకాష్ అనే వ్యక్తి రూ. 3.53 లక్షలకు హక్కులను దక్కించుకున్నాడు. ఏడాది పాటు గేటు వసూలుకు చేసుకునేందుకు పంచాయతీ అనుమతించింది.