గీతన్నల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు
నేడు, రేపు ప్రతినిధుల సభ
సూర్యాపేట : కల్లుగీత కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాల్గవ మసహాసభల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హారై మాట్లాడారు. నిత్యం స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పే బీజేపీ నాయకులు స్వదేశీ కల్లును, నీరాను ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. సర్వాయి పాపన్న విగ్రహాలకు పూల మాలలు వేసి దండాలు పెడుతున్న పాలకులు పాపన్న వారసులైన కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గీత కార్మికుల ప్రతి సొసైటీకి రూ.20 లక్షలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కల్లుగీత వత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
మోకు, ముస్తాదులతో భారీ ప్రదర్శన
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం సందర్భంగా జిల్లా కేంద్రంలో కల్లుగీత కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎంవీ.రమణ రచించగా ప్రభుత్వ కళాకారుడు మానుకోట ప్రసాద్ పాడిన ‘మోకు పైలం మోయి గౌడ వెంకీ పైల మోయి గౌడ’ అనే పాటల సీడిని హైదరబాద్ సుప్రజ హాస్పిటల్ ఎండీ సిగ విజయ్‌కుమార్‌గౌడ్ ఆవిష్కరించారు. సంఘం ఉద్యమ నిర్మాత తొట్ల మల్సూర్ స్వగ్రామమైన నూతనకల్ మండలం చిల్పకుంట్ల నుంచి తీసుకొచ్చిన స్మారక జ్యోతిని రమణకు సభా వేదికపై అందజేశారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగూరి గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ చౌగాని సీతారాములు, బోలగారి జయరాములు, జయరాములు, గౌని వెంకన్న, బొల్లె వెంకట మల్లయ్య, ఎస్.రమేష్ గౌడ్, బూడిద గోపి, పామన గుండ్ల అచ్చాలు, ఉష గాని వెంకటనరసయ్య, బండకింది అరుణ, గౌరీ అంజయ్య, జిల్లా నాయకులు కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్న గౌడ్, టైసన్ శ్రీను, ఉయ్యాల నగేష్, మడ్డి అంజిబాబు, బత్తుల జనార్దన్, సైదయ్య పాల్గొన్నారు.
ఫ కల్లుగీత కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ
ఫ సూర్యాపేటలో ఆ సంఘం
రాష్ట్ర మహాసభలు ప్రారంభం
ఈ నెల 29, 30వ తేదీల్లో కల్లుగీత కార్మిక సంఘం మహాసభల ప్రతినిధుల మహాసభ జిల్లా కేంద్రంలోని అంతటివిజయ్ ఫంక్షన్ హాల్( కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యుడు వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో నిర్వహించనున్నారు. 30న రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికతో సభ ముగుస్తుంది.
గీతన్నల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు


