ఎన్నికలకు ఐదంచెల భద్రత : ఎస్పీ
మునగాల : ఈ నెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఐదంచెల పోలీస్ భద్రత కల్పించాలని పోలీస్ అధికారులను ఎస్పీ నరసింహ ఆదేశించారు. ఆదివారం ఆయన మునగాల మండలం రేపాల క్లస్టర్‌లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100మీటర్ల పరిధి ఆంక్షలు అమలు చేయాలని, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలకు పంపించాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఘర్షణలకు తావివ్వొద్దన్నారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ డి.రామకృష్ణారెడడ, ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.


