సర్పంచ్‌కు 1,387.. వార్డులకు 3,791
3న అభ్యర్ధుల తుది జాబితా
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల లెక్క తేలింది. నవంబర్ 27వ తేదీ నుంచి శనివారం సాయంత్రం వరకు ఎన్నికల కమిషన్ నామినేషన్ల స్వీకరణకు అవకాశమిచ్చింది. ఈ క్రమంలో సర్పంచ్, వార్డు స్థానాలకు శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బారులుదీదారు. దీంతో రాత్రి 10 నుంచి 11గంటల వరకు పలు సెంటర్లలో ప్రక్రియ కొనసాగింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున ఎన్నికల అధికారులు జిల్లాలో సర్పంచ్, వార్డులకు దాఖలైన నామినేషన్ల వివరాలను వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు 1,387, వార్డులకు 3,791 నామినేషన్లు దాఖలు అయ్యాయని ప్రకటించారు.
చివరి రోజు 1,021 నామినేషన్లు
తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామ పంచాయతీల్లో ఎన్నిలకు నవంబర్ 27న ఉదయం నోటికేషన్ విడుదలైంది. వెంటనే 159 సర్పంచ్, 1,442 వార్డు సభ్యులకు నామినేషన్లు స్వీకరించినా.. తొలి రోజు సర్పంచ్‌కు 207, వార్డు సభ్యులకు 38 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. రెండో రోజు సర్పంచ్ స్థానాలకుకు 159, వార్డు సభ్యుల స్థానాల కోసం 142 నామినేషన్లతో కలిపి మొత్తంగా రెండు రోజుల్లో సర్పంచ్‌కు 366, వార్డు స్థానాలకు 180 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 1,021, వార్డులకు 3,611 నామినేషన్లు వేశారు.
ఫ మొదటి విడత పంచాయతీ పోరుకు దాఖలైన నామినేషన్లు
ఫ రాత్రి వరకు కొనసాగిన
నామినేషన్ల పరిశీలన
ఫ 3న విత్‌డ్రా.. అభ్యర్ధుల తుది జాబితా
మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఆశావాహులు దాఖలు చేసిన నామినేషన్లను ఆదివారం పరిశీలించారు. ఒక్కో నామినేషన్ పరిశీలనకు సమయం పట్టడంతో ఈ ప్రక్రియ కూడా ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. పరిశీలన పూర్తి చేసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 1న సోమవారం ఏదైనా కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురైతే.. అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించి, డిసెంబర్ 2న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. 3న అభ్యర్థుల నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించి, అదేరోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల తుదిజాబితాను ప్రకటించనున్నారు. తదనంతరం గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది.


