అడ్డదారిన బోనస్ నొక్కేస్తున్నారు!
గతంలో కందుల కొనుగోళ్లలోనూ ఇలాగే..
తిరుమలగిరి (తుంగతుర్తి) : సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే క్వింటాకు రూ.500 బోనస్ కాజేసేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారిలో వ్యాపారం సాగిస్తున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొందరు వ్యాపారులు సన్న ధాన్యం (సాంబ మసూరి) క్వింటాకు రూ.2వేల నుంచి రూ.2,200 వరకు కొనుగోలు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటా రూ.2,389కు అమ్ముతున్నారు. దీనికితోడు క్వింటాకు ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ కూడా నొక్కేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క తెలిసిన రైతుల పేర్ల మీద ధాన్యం అమ్ముతూ క్వింటాకు రూ.500నుంచి రూ.600 లాభం గడిస్తున్నారు. కొన్ని రోజులుగా తిరుమలగిరి మార్కెట్‌లో రోజూ 500 నుంచి వెయ్యి బస్తాల వరకు కొనుగోలు చేసి ట్రాక్టర్లు, డీసీఎంల ద్వారా తిరుమలగిరి మండలం చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని తమకు అనుకూలమైన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా అమ్ముతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నారు. వచ్చిన లాభాల్లో కేంద్రాల నిర్వాహకులకూ కొంత ముట్టజెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్కెట్‌లో కొనుగోలు చేసి..
కొందరు రైతులు వ్యవసాయ మార్కెట్‌లోనే సన్న ధాన్యాన్ని క్వింటాకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు అమ్ముకుంటున్నారు. రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యం లేకపోవడంతోపాటు కొనుగోళ్లు జాప్యం కావడం, డబ్బులు ఆలస్యంగా వస్తాయని, తేమ శాతం కొర్రీల వంటి కారణాలతో రైతులు తక్కువ ధరకై నా మార్కెట్‌లోనే అమ్ముకుంటున్నారు. ఇలా రైతులు అమ్ముకుంటున్న ధాన్యాన్ని కొందరు వ్యాపారులు, బడా రైతులు కొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరతోపాటు బోనస్ పొందుతున్నారు.
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌తోపాటు మండల వ్యాప్తంగా గతం నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోళ్లకు ప్రభుత్వం హాకా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొందరు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను ఈ కేంద్రం ద్వారా అమ్మి రూ.లక్షలు గడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు కొందరు మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మకై ్క లేని భూమి ఉన్నట్లు, అందులో పంట పండినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దాని కొనసాగింపుగా ఐకేపీ కేంద్రాలకు ధాన్యం విక్రయించినట్లు, మిల్లుకు సరఫరా చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఇలా భూముల్లేని కొందరి బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయ్యాయి. వాటిని మిల్లర్లు, వ్యాపారులు, కేంద్రాల నిర్వాహకులు పంచకున్నారు. ఏటా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
సన్న ధాన్యం
వ్యాపారుల తప్పటడుగులు
ఫ తిరుమలగిరి మార్కెట్‌లో
తక్కువ ధరకు కొనుగోలు
ఫ ప్రభుత్వ కేంద్రాల్లో యథేచ్ఛగా అమ్ముకం
ఫ మద్దతుతోపాటు క్వింటాకు
రూ.500 బోనస్ పొందుతూ..
ఫ ప్రభుత్వ ఖజానాకు
గండికొడుతున్న వ్యాపారులు


