పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ
తుంగతుర్తి, మద్దిరాల : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి, మద్దిరాలలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మొదటి విడత గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ కేంద్రాలలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలన్నారు. అనంతరం మండల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాదవ్‌రావు, తుంగతుర్తి తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓలు శేషుకుమార్, సత్యనారాయణరెడ్డి, సీఐ నాగేశ్వరరావు సిబ్బంది ఉన్నారు.


