కేసుల పరిష్కారానికి కృషిచేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ మీడియేషన్ సభ్యులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. ఇటీవల ఎంపికై న జిల్లా న్యాయసేవాధికార సంస్థ మీడియేషన్ సభ్యులు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారదను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మీడియేషన్ సభ్యులు జె.శశిధర్, ఏడిండ్ల అశోక్, మంతపురం కిశోర్, మాండ్ర మల్ల య్య, పసల బాలరాజు, పోలోజు మధు, పల్లేటి రాముడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


