కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలి
సూర్యాపేట : కల్లు గీత వృత్తిని ఆధునీకరించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ ఫంక్షన్ హాల్( వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు. తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నెరవేర్చలేదన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, కౌడిన్య, అమెరికన్ ఆఫ్ నార్త్ ఇండియా అసోసియేషన్ చైర్మన్ నాతి శ్రీనివాస్ గౌడ్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్, బాలగాని జయరాములు, ఎస్.రమేష్ కుమార్, మడ్డి అంజిబాబు, బుర్ర స్వప్న, చౌగాని సీతారాములు, నాగరాజు, శాంత కుమార్, గౌని వెంకన్న, బాలే వెంకట మల్లయ్య, బూడిద గోపి, ఉషా గాని వెంకట నరసయ్య, ఎల్గూరి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలకు హాజరైన ప్రతినిధులకుహైదరాబాద్ కు చెందిన సుప్రజ హాస్పిటల్ ఎం.డి శిగ విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు.
ఫ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి


