నామినేషన్ల జోరు
రెండో విడతలో..
నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్లస్టర్ కేంద్రాల వద్ద బారులుదీరారు. రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. రాత్రి 11గంటల వరకు అందిన సమాచారం మేరకు సర్పంచ్ స్థానాలకు 866 , వార్డు స్థానాలకు 4,506నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా చివరి రోజు మాత్రం సర్పంచ్‌కు 500, వార్డులకు 4326 మంది నామినేషన్ల వేశారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరణ సెంటర్లకు వచ్చిన వారికి అధికారులు అవకాశం కల్పించారు.
సమయం ముగిసిన తర్వాత కూడా..
సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలోగల 486 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామాలు, 1,442 వార్డులకు తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన 27వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నప్పటికీ మొదటి రోజు అభ్యర్థులకు 207, వార్డు సభ్యులకు 157 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు శుక్రవారం అష్టమి కారణంగా మంచిరోజు కాకపోవడమే కాకుండా నామినేషన్ దాఖలుకు బ్యాంక్ అకౌంట్‌తో పాటు పలు ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉన్న కారణంగా కేవలం సర్పంచ్‌కు 159 , వార్డులకు 142 నామినేషన్ల వచ్చాయి. చివరి రోజు కావడం, పొత్తులు, హామీలు, సమీకరణలు చూసుకుని ఆయా పార్టీలు, వ్యక్తిగతంగా పెద్దగా ఆయా పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్ల దాఖలుకు పోటీ పడ్డారు. ఆత్మకూర్ (ఎస్)లోని ఏపూరు, తుమ్మలపెన్‌పహాడ్ గ్రామాల్లో పోలింగ్ జరిగే సమయంలో ఉన్న మాదిరిగానే అభ్యర్థులు పెద్దఎత్తున క్యూలో నిల్చొని నామినేషన్లు వేశారు. తిరుమలగిరి మండలంలోని జలాల్‌పురం, తొండ, తుంగతుర్తి మండలంలోని పలుచోట్ల రాత్రి పొద్దుపోయే వరకు గ్రామపంచాయతీ ఆవరణల్లోనే ఉండి నామినేషన్లు వేశారు. రాత్రి సమయం కావడంతో క్యూలో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక సిబ్బంది లైటింగ్‌తో పాటు మంచినీరు, తదితర సదుపాయాలు కల్పించారు.
మండలం పంచాయతీలు వార్డులు క్లస్టర్లు
అనంతగిరి 20 178 06
చిలుకూరు 17 158 05
చివ్వెంల 32 258 09
కోదాడ 16 158 04
మోతె 29 262 07
మునగాల 22 210 06
నడిగూడెం 16 148 05
పెన్‌పహాడ్ 29 256 07
మొత్తం 181 1,628 49
మొదటి విడత ముగిసిన నామినేషన్ల స్వీకరణ
ఫ పంచాయతీలకు 866, వార్డులకు4,506నామినేషన్లు దాఖలు
ఫ క్లస్టర్ల వద్ద బారులుదీరిన అభ్యర్థులు
ఫ చివరిరోజు కావడంతో రాత్రి వరకు సాగిన ప్రక్రియ
ఫ నేటి నుంచి రెండో విడత 181
పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ
రెండోవిడతలో చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని 181 గ్రామపంచాయతీల్లో ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్ల స్వీకరణ కోసం క్లస్టర్ల వారీగా గ్రామాలను విభజించారు. ఈ మేరకు 181 గ్రామపంచాయతీలు, 1,628 వార్డులకు గాను నామినేషన్లు స్వీకరించేందుకు 49 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 14వ తేదీన నిర్వహించే రెండో విడత పోలింగ్‌లో 2,52,745 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
నామినేషన్ల జోరు


