దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు
భానుపురి (సూర్యాపేట) : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియ్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న దివ్యాంగుల క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ అధికారి నరసింహా రావు ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు ఆటల ద్వారా మానసిక ఉల్లాసం, మనోధైర్యం కలుగుతుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి డిసెంబర్ 3న నిర్వహించే జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకట రమణ, డీఈఓ అశోక్, జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా
నిర్వహించేలా సహకరించాలి
నూతనకల్: ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలు సహకరించాలని జెడ్పీ సీఈఓ అప్పారావు కోరారు. శనివారం నూతనకల్‌తో పాటు మండల పరిధిలోని మిర్యాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆర్డీఓ వేణుమాధవ్‌తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునిత, అధికారులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా ఇన్‌చార్జుల నియామకం
నల్లగొండ టూ టౌన్: బీజేపీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జిల్లా ఇన్‌చార్జులను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉదయ్ ప్రతాప్ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జిగా, నల్లగొండ జిల్లాకు చెందిన టి.రవికుమార్‌ను సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జిగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎన్.శ్రీనివాస్‌రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. ఈ నియామకం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని, పార్టీ కార్యక్రమాలు వీరు పర్యవేక్షిస్తారని తెలిపారు.
పకడ్బందీగా ఆలయ
భద్రతా వ్యవస్థ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా వ్యవస్థను పకద్బందీగా అమలు చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. కొండపైన, కొండ కింద, భక్తుల ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేస్తున్న బ్యాగేజీ స్క్రీనింగ్ యంత్రాల ఏర్పాటును శనివారం ఆయన పరిశీలించారు. ఎస్‌పీఎఫ్ అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతను మరింత పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్, ఎస్‌పీఎఫ్ అధికారులకు స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగ భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను నిరంతరం నడిపించే విధంగా చూడాలని, ఆలయంలోని వివిధ ప్రదేశాల్లో వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సూచించారు.
గిరి ప్రదక్షిణను
విజయవంతం చేయాలి
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థానం డిసెంబర్ 1న ప్రత్యేకంగా గిరిప్రదక్షిణ నిర్వహించనుందని ఆలయ ఈఓ వెంకట్రావ్, అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఉదయం 5గంటలకు యాదగిరి కొండ చుట్టూ ప్రదక్షిణ ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం నేరుగా వెళ్లి కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు
దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు


