ఓవర్ లోడుతో రోడ్డెక్కితే సీజ్
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం
సూర్యాపేట టౌన్ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంంది. రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేసింది. ఇటీవల చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికడుతూ మరణాల రేటును తగ్గించేందుకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలు ఓవర్ లో డుతో రోడ్డెక్కితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.లక్షల్లో జరిమానా విధిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మూడు విజిలెన్స్ అధికారుల బృందంతో పాటు ఉమ్మడి జిల్లాలో మూడు, జిల్లాలో మరో ఆరు టీంలతో పాటు ఏవీంఐలు తనిఖీలు విస్తృతం చేశారు. పన్నుల చెల్లింపులు, అనుమతి పత్రాలు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, ఓవర్‌లోడు అంశాలను పరిశీలిస్తూ ని బంధనలు పాటించని వాహనాలను పట్టుకొని భారీ జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు.
వందలాది వాహనాలపై కేసులు నమోదు
రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాలతో పాటు జిల్లాలోని రవాణా శాఖ అధికారులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. వీరు జిల్లాల్లో ఎక్కడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తూ వాహనాల పత్రాలు పరిశీలించి తేడాలుంటే జరిమానా విధిస్తున్నాయి. ఇసుక, కంకర, మొరం లోడుతో వెళ్లే లారీలు, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలను పట్టుకొని ఫైన్‌లతో పాటు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి చేపడుతున్న తనిఖీల్లో 342 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో 64 వాహనాలు ఇసుక ట్రాక్టర్లు, కంకర లారీలు, ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకున్న ఆటోలు ఉన్నాయి. ఈ వాహనాలకు మొత్తం రూ.11.46లక్షలు జరిమానా విధించారు. అలాగే మిగతా 278 వాహనాలకు సరైన పత్రాలు, ఫిట్‌నెస్, ఇతర ధ్రువపత్రాలను లేనివిగా రవాణా శాఖ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. వీటన్నింటికి మొత్తం రూ.54.82 లక్షల జరిమానాలు విధించారు.
రెండో సారి దొరికితే అంతే సంగతులు..
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడు వల్లే అధికంగా జరుతుండడంతో వాటిమీదే యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవర్ లోడు అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు రెండో సారి ఓవర్‌లోడుతో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల, కళాశాల బస్సులు కూడా ఓవర్ లోడ్‌తో వెళితే కేసులు తప్పవని రవాణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ తనిఖీలు
ఫ నిబంధనల ఉల్లంఘనపై కొరడా
ఫ సరైన పత్రాలు, ఫిట్‌నెస్‌లేని 278 వాహనాలకు జరిమానా
ఫ 342 వాహనాలపై కేసులు
వాహనదారులు రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నాం. ముఖ్యంగా ఓవర్ లోడుతో, పరిమితికి మించి వాహనదారులను తరలించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. ఓవర్ లోడ్‌తో పాటు నిబంధనలు పాటించకుండా రెండో సారి కూడా పట్టుబడే వాహనాల పర్మిట్ రద్దుతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తాం.
– జయప్రకాష్‌రెడ్డి, ఇన్‌చార్జి
జిల్లా రవాణా శాఖ అధికారి


