సీఐటీయూ అధ్యక్షుడిగా వెంకటనారాయణ
కోదాడ: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా కోటగిరి వెంకటనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనెల 24,25 తేదీల్లో నిర్వహించిన సీఐటీయూ జిల్లా సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న కార్మికులకు, సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
టెట్ నుంచి
మినహాయించాలి
నేరేడుచర్ల : టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎప్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్‌కుమార్ కోరారు. బుధవారం ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ 2010 ఆగస్టు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ తప్పని సరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి పార్లమెంటులో విద్యాహక్కు చట్టం సెక్షన్ 23ని సవరించడం ద్వారా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో శ్రీనయ్య, అక్కయ్యబాబు, నాగేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, రవీందర్, వెంకటేశ్వర్‌రావు, కృష్ణయ్య తదదితరులున్నారు.
సీఐటీయూ అధ్యక్షుడిగా వెంకటనారాయణ


