తూకంలో తేడాలున్నాయని రైతుల ఆందోళన
నేరేడుచర్ల : మండలంలోని చిల్లేపల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం ఒక్కో ట్రాక్టర్‌కు 95కిలోలు తక్కువగా వస్తున్నాయంటూ శనివారం రైతులు ఆందోళన నిర్వహించారు. రైతు కొండ ముసలయ్య చిల్లేపల్లి వద్ద గల రైస్ మిల్లుకు ట్రాక్టర్‌లో ధాన్యం తేగా మిల్లు ఆవరణలో ఉన్న వేబ్రిడ్జిలో తూకం వేస్తే 7,880 కిలోలు వచ్చింది. దాంతో ఆయన తన ట్రాక్టర్‌ను మరో మిల్లుకు తీసుకెళ్లి తూకం వేయగా 7,975 కిలోలు వచ్చింది. ఈ విషయమై రైతులు మిల్లు వద్ద ఆందోళన నిర్వహించారు. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ విచారణ నిర్వహించారు. తూనికలు కొలతల అధికారితో తూకంలో తేడాను నిర్ధారించి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


