వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
సూర్యాపేట : అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్‌తో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. నవంబర్ 12 నుంచి 19 వరకు నిర్వహించే వారోత్సవాల్లో పోస్టర్ల ఆవిష్కరణ, జిల్లాస్థాయిలో వృద్ధుల చట్టాలపై అవగాహన, వృద్ధాశ్రమాల్లో ఆటల పోటీలు, సీనియర్ సిటిజన్స్ హక్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, వయో వృద్ధుల కమిటీ మెంబర్లు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సభ్యులు, జి.విద్యాసాగర్, హమీద్‌ఖాన్, రాంబాబు, కృష్ణారెడ్డి, కిరణ్మయి, జావిద్ ఖాన్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


