రిటైర్డ్ ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమించాలి
సూర్యాపేట : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలోని బ్రాహ్మండ్లపల్లిలో గల ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆ సంఘం సూర్యాపేట యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం సంఘం సూర్యాపేట యూనిట్ అధ్యక్షుడిగా దండ శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శిగా ఎస్.నాగేశ్వర్‌రావు, ఫైనాన్స్ సెక్రటరీగా కె.కృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్.యాదగిరి, ఉపాధ్యక్షులుగా జి.సోమయ్య, బి.హైమావతి, జాయింట్ సెక్రటరీగా పోతుగంటి రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.సురేందర్‌రెడ్డి, పబ్లిసిటీ సెక్రటరీగా బి.వీరయ్య, జిల్లా కౌన్సిలర్లుగా ఎం.మేరినిర్మల, ఎండీ అబ్దుల్లా, పాదూరి రజితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎన్.సుదర్శన్ రెడ్డి, హమీద్ ఖాన్, బొల్లు రాంబాబు, శ్రీనివాసరావు, విద్యాసాగర్‌రావు, లక్ష్మీనర్సింహారెడ్డి, పులుసు పుల్లయ్య, సుదగాని నాగేశ్వర్‌రావు, ఖలీల్ అహ్మద్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం
రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య


