పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు

Oct 26 2025 6:45 AM | Updated on Oct 26 2025 6:45 AM

పోచంప

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు

న్యూస్‌రీల్‌

భద్రతా ఏర్పాట్లు

పర్యవేక్షించిన డీఐజీ చౌహాన్‌

ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది

భూదాన్‌పోచంపల్లిలో శనివారం హైదరాబాద్‌లోని హామ్‌స్టక్‌ ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ విద్యార్థులు పర్యటించారు.

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

- 8లో

పీఆర్సీని వెంటనే

ప్రకటించాలి

కోదాడ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.సోమయ్య అన్నారు. శనివారం మోతె మండల కేంద్రంలో జరిగిన ఆ సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా పీఆర్సీ ప్రకటించకుండా ఆలస్యం చేయడం తగదన్నారు. ధరల పెరుగుదలకు అనుగునంగా ఉద్యోగులకు ఏటా రెండు డీఏలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దామళ్ల నరేందర్‌, ఉపాధ్యక్షులుగా ఏలె సీనయ్య, జి కవిత, ప్రధాన కార్యదర్శిగా భూక్య చాంప్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, పాపిరెడ్డి, ఆనందకిషోర్‌, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగుల ధర్నాను

జయప్రదం చేయాలి

సూర్యాపేట: పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నవంబర్‌ 7వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, బొల్లు రాంబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైరైన ఉద్యోగులకు పెన్షనర్ల బెనిఫిట్స్‌ తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆదివారం (ఈనెల 26న) సూర్యాపేటలో జరిగే సన్నాహక సమావేశానికి జిల్లా కమిటీ, కార్యవర్గ సభ్యులు, మండల కమిటీలు హాజరుకావాలని కోరారు.

మహా ప్రదర్శనకు తరలిరావాలి

తిరుమలగిరి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌.గవాయ్‌పై జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 1న హైదరాబాద్‌లో చేపట్టే దళితుల ఆత్మగౌరవ మహా ప్రదర్శన కార్యక్రమానికి తరలి వచ్చి విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ కోరారు. శనివారం నాగారం మండలం పస్తాల గ్రామంలో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు బొజ్జ అశోక్‌, భిక్షమయ్య, వెంకన్న, కండె ఐలయ్య, బొజ్జ వెంకటేశ్వర్ల, మల్లయ్య, బొంకూరి నాగయ్య, బొజ్జ అశోక్‌, కండే సత్తయ్య, బొజ్జ యల్లయ్య, కండే సాగర్‌, రవి, కృష్ణ, విజయ్‌, శ్రీకాంత్‌, విజయరామరాజు, కళ్యాణ్‌, మహేష్‌, సతీష్‌, అనిల్‌, చింటూ తదితరులు పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

హుజూర్‌నగర్‌ : మఠంపల్లి మండలం మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం స్వా మి అమ్మవార్ల ఎదుర్కోలు, నిత్య కల్యా ణం నిర్వహించారు. అలాగే క్షేత్రంలోని శివాలయంలో కార్తీకమాసం పూజలు కొనసాగాయి. పార్వతీరామలింగేశ్వరస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆ తర్వాత దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌ : డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ, సింగరేణి కాలరీస్‌ సహకారంతో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హుజూర్‌నగర్‌ పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఉదయం 8 గంటల నుంచే మెగా జాబ్‌మేళా ప్రాంగణానికి అభ్యర్థుల రాక మొదలైంది. వచ్చిన అభ్యర్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా జాబ్‌మేళాను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా వచ్చిన అనుభవం, గుణపాఠంతో మున్ముందు ఇంతకన్నా మెరుగ్గా జాబ్‌మేళాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, డీఐజీ ఎల్‌ఎస్‌.చౌహాన్‌, కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, సూర్యాపేట, నల్లగొండ ఎస్పీలు నరసింహ, శరత్‌చంద్ర పవార్‌, ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, డీఈఈటీ డైరెక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ వంశీధర్‌రెడ్డి, సింగరేణి జీఎం కృష్ణయ్య, ప్రతినిధులు రామస్వామి, తుకారం, రవి కుమార్‌, సుధాకర్‌, కోఆర్డినేటర్‌ పుల్లూరి చంద్రం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామరావు, చింతల లక్ష్మీనారాయణ రెడ్డి, తన్నీర్‌ మల్లిఖార్జున్‌, దొంగరి వెంకటేశ్వర్లు, కొత్త శ్రీనివాస్‌, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

20 వేలమందికిపైగా హాజరు

జాబ్‌మేళాకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 40 వేల మందికిపైగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా 20 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం తర్వాత రద్దీ పెరిగింది. విద్యార్హతలను బట్టి అభ్యర్థులను ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు.

కంపెనీల వారీగా ఇంటర్వ్యూలు

ఐటీ, ఎడ్యు టెక్నాలజీ, స్కిల్స్‌ ట్రైనింగ్‌ విభాగంలో 5,547 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 827 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. మరో 370 మంది అభ్యర్థుల ఉన్నత అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ రూపొందించారు. అలాగే సర్వీస్‌ మొబైల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 3,850 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 391 మందిని ఎంపికచేసుకున్నారు. 804 మందితో షార్ట్‌లిస్టు రూపొందించారు. మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌, టెక్నికల్‌ రంగంలో 4,520 మంది హాజరుకాగా 610 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ విభాగంలో 2,440 మందికి 713 మంది, ఫార్మా హెల్త్‌కేర్‌, హాస్పిటాలిటీ విభాగంలో 2,167 మందికి 210 మంది ఎంపికయ్యారు. మరో 195 మంది అభ్యర్థుల షార్ట్‌ లిస్టును రూపొందించారు. ఆటోమొబైల్స్‌ రంగంలో 952 మందికి 102 మంది ఎంపిక అయ్యారు. 154 మందితో షార్ట్‌ లిస్టును సిద్ధం చేశారు. లాజిస్టిక్‌, ఎయిర్‌ పోర్ట్‌ రంగంలో 1,047 మందికి 188 మంది ఎంపిక కాగా 10 మంది షార్ట్‌లిసుతో రూపొందించారు. మొత్తంగా 20, 523 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా 3,041మంది ఉద్యోగాలు పొందారు. 1,533మందిని వెయిటింగ్‌ లిస్టులో పెట్టారు.

నేటి జాబ్‌మేళా వాయిదా..

పలుచోట్ల జాబ్‌మేళా నిర్వహించాల్సి ఉన్న కారణంగా ఆదివారం నిర్వహించే జాబ్‌మేళా వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. జాబ్‌మేళా అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్‌ మేళాను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు. మేళాను విజయవంతానికి సహ కరించిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, పోలీస్‌, ఇతర అధికారులు, వివిధ శాఖల సిబ్బందికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళా వద్ద భద్రతా ఏర్పాట్లను డీఐజీ చౌహాన్‌ స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా ఎసీప నరసింహ ఆధ్వర్యంలో ఇద్దరు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 18 మది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 600 మంది పోలీస్‌ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. డీఐజీ వెంట సూర్యాపేట ఎస్పీ నరసింహ, ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌, నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఉన్నారు.

ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు

ఫ 20,523 మంది అభ్యర్థులు హాజరు

ఫ ఉద్యోగాలకు ఎంపికై న 3,041 మంది

ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాలు రావాలంటే హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా ంటిది జిల్లా పరిధిలోని హుజూర్‌నగర్‌లో జాబ్‌మేళా నిర్వహించి వీ సాఫ్ట్‌ కంపెనీలో నెలకు రూ.25వేల ఉద్యోగం ఇవ్వడం మరిసిపోలేని అనుభూతి. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందుకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.

– వై.అమూల్య,

ఉద్యోగం పొందిన అభ్యర్థి, నేరేడుచర్లగ

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు1
1/6

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు2
2/6

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు3
3/6

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు4
4/6

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు5
5/6

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు6
6/6

పోచంపల్లిలో ‘ఫ్యాషన్‌’ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement