జాబ్ మేళాకు పటిష్ట భద్రత : ఎస్పీ
హుజూర్‌నగర్ : మెగాజాబ్ మేళాకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. హుజూర్‌నగర్ పట్టణంలో ఈనెల 25న నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా భద్రతా ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జాబ్‌మేళాకు 20 వేలకు పైగా యువతీ యువకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు సరైన మార్గాన్ని పోలీసు సిబ్బంది చూపించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్‌పీలు ప్రసన్నకుమార్, రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, సీఐలు చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ప్రతాప్ లింగం, ఎస్‌ఐలు మోహన్ బాబు, నరేష్, రవీందర్, బాబు, కోటేష్ పాల్గొన్నారు.


