విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి
కోదాడరూరల్ : వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ యు. బాలస్వామి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కోదాడ పట్టణంలోని గోపిరెడ్డినగర్‌లో విద్యుత్‌లైన్‌లను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ దృష్టికి తెచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్‌లైన్‌లకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని, లూజ్‌లైన్‌లు, లో ఓల్టేజ్ వంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్‌శాఖ అధికారి ఎస్.ఫ్రాంక్లిన్, డీఈ వెంకటకృష్ణయ్య, ఏడీఈ ఎం.వెంకన్న, పట్టణ ఏఈ బి.నరసింహనాయక్, సిబ్బంది, ప్రజలు ఉన్నారు.
ఫ విద్యుత్ శాఖ రూరల్ జోన్
చీఫ్ ఇంజనీర్ బాలస్వామి


