భానుపురి (సూర్యాపేట): గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 25న హుజూర్‌నగర్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రైవేటు కళాశాలల కరస్పాండెంట్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారన్నారు. చదువుకున్న యువత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అవగాహన రాహిత్యం వల్ల ఉద్యోగాలు పొందలేక పోతున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 250 ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని, ఇందులో 25 వరకు ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 12,500 మంది యువత రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. అనంతరం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఇతరశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఎక్సేంజ్ రాష్ట్ర డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్పీ నరసింహ, అడిషనల్ కలెక్టర్ కె.సీతారామారావు, సింగరేణి ప్రతినిధులు శ్రీధర్, చందర్, డీట్ ప్రతినిధి వంశీ, ప్రజా ప్రతినిధులు సరోత్తంరెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, కొప్పుల వేణారెడ్ది, పోతు భాస్కర్, చింతల లక్ష్మీనారాయణరెడ్డి, చకిలం రాజేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
హుజూర్‌నగర్ : పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 25న నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను బుధ వారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జాబ్‌మేళా విజయ వంతానికి అధికారులు, నాయకులు కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తన్నీరు మల్లిఖార్జున్, సీహెచ్. లక్ష్మీనాయణరెడ్డి, గెల్లి రవి, కోతి సంపత్‌రెడ్డి, దొంతగాని శ్రీనివాస్, అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, శివరాం యాదవ్, ఆదెర్ల శ్రీనివాస్‌రెడ్డి, సాముల శివారెడ్డి, గల్లా వెంకటేశ్వర్లు, అజీజ్‌పాషా, మహేశ్, కోడి ఉపేందర్, కొత్తా శ్రీనివాస్‌రావు ఉన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


