
మహాగర్జనను విజయవంతం చేయాలి
నడిగూడెం : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 14న జరిగే చేయూత పింఛన్‌దారుల మహాగర్జనను విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాశీం పిలుపునిచ్చారు. శుక్రవారం నడిగూడెంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో మాట్లాడారు. వికలాంగులకు రూ.6,016, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులకు రూ.4,016 పింఛన్ ఇవ్వాలన్నారు. సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్, జిల్లా అధ్యక్షుడు చింత సతీష్, ప్రతినిధులు రావి స్నేహలత చౌదరి, మోష, దున్నా రాజు, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, సైదులు, మహేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.